‘అర్హులైన పేదలకు ‘డబుల్‌’ ఇండ్లను కేటాయించాలి’

నవతెలంగాణ-కాప్రా
అర్హులైన పేదలకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లను వెంటనే కేటాయిం చాలని కాంగ్రెస్‌ ఉప్పల్‌ నియోజ కవర్గం నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి డిమాండ్‌ చేశారు. ఎన్నాళ్లని ప్రశ్నిద్దాం.. పాలకులనే మారుద్దాం.. అంటూ అర్హులైన పేదలకు వెంటనే డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లను కేటాయిం చాలని కోరుతూ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలతో రాగిడి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఈసీఐఎల్‌ చౌరస్తా నుంచి కాప్రా సర్కిల్‌ మున్సిపల్‌ ఆఫీస్‌ వరకు భారీగా నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం లక్ష్మారెడ్డి మాట్లాడుతూ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల నిర్మాణంలో ప్రభుత్వం జాప్యం చేస్తూ పేద ప్రజలను తీవ్ర ఇబ్బంది గురి చేస్తున్నదని అన్నారు. రాష్ట్రంలో లక్షలాదిమంది పేద ప్రజలు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల కోసమే దరఖాస్తు చేసుకుంటే ఇప్పుడు రాష్ట్రంలో నిర్మాణదశలో కేవలం 50,000 వేల ఇండ్లు కూడా లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండ్లను అర్హులకు కేటాయించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని లేనిప క్షంలో న్యాయపరంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే కేటాయించిన ఇండ్లను లబ్దిదారులకు అందజేయడంలో జాప్యం ఎందుకని ప్రశ్నించారు. లబ్దిదారులకు ఇండ్లు కేటాయించే వరకు ప్రభుత్వమే నెలకు రూ.5వేల చొప్పును వారి అద్దె చెల్లించాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు ప్రజలపై ప్రేమ ఉన్నట్టు నాటకాలాడుతున్నాయని విమర్శించారు. అర్హులైన పేదలకు ఇండ్లు అందించని యెడల టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజలతో కలసి భారీ ఎత్తున ధర్నా నిర్వహిస్తమని హెచ్చరించారు.ఈ కార్యక్ర మంలో కార్పొరేటర్‌ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్‌ రెడ్డి, కాంగ్రె స్‌ సీనియర్‌ నాయకులు రాఘవరెడ్డి, టీపీసీసీ సెక్రటరీ పసుల ప్రభాకర్‌ రెడ్డి, రామిరెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ఎస్సీ సెల్‌ చైర్మెన్‌ పత్తి కుమార్‌, కాంగ్రెస్‌ నాచారం డివిజన్‌ ఇన్‌చార్జ్‌ మేడల మల్లికార్జున గౌడ్‌, మల్లాపూర్‌ డివిజన్‌ కంటెస్టెడ్‌ కార్పొరేటర్‌ వంగటి సంజీవరెడ్డి, కాంగ్రెస్‌ మల్లాపూర్‌ డివిజన్‌ ప్రెసిడెంట్‌ నెల్లుట్ల శీను గౌడ్‌ , కం టెస్టడ్‌ కార్పొరేటర్‌ గడ్డం యాదగిరి, కాంగ్రెస్‌ హౌసింగ్‌ బోర్డ్‌ డివిజన్‌ ప్రెసిడెంట్‌ సముద్రాల కృష్ణమూర్తి పాల్గొన్నారు.

Spread the love