నవతెలంగాణ – హైదరాబాద్: మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో జనరల్ కోచ్‌ల సంఖ్యను రెట్టింపు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ప్రస్తుతం 2 కోచ్‌లు ఉన్న రైళ్లలో 4కు, జనరల్ కోచ్‌లు లేని రైళ్లకు 2 బోగీలను సమకూరుస్తామని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1,377 స్లీపర్ క్లాస్ కోచ్‌లు, అదనంగా 2,500 జనరల్ బోగీలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొంది. ఒక్కో కోచ్‌లో 150-200 మంది ప్రయాణించేలా తయారు చేస్తున్నట్లు తెలిపింది.