గ్రామాలలో నీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి: డీపీఓ సురేష్

నవతెలంగాణ – చివ్వేంల
గ్రామాల్లో నీటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డిపిఓ సురేష్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామపంచాయతీ కార్యాలయంలో రికార్డులు పరిశీలించి మాట్లాడారు. ఈ సందర్భంగా అంగన్ వాడి  కేంద్రంతోపాటు, గ్రామంలో పారిశుద్ధ్య పనులు పరిశీలించారు.  పరిసరాల పరిశుభ్రత పాటించడంతోపాటు,  త్రాగునీటి సమస్యలు తలెత్తే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.  ఈ కార్యక్రమంలో ఎంపీ ఓ గోపి, అంగన్ వాడి  టీచర్ నిర్మల, ఆశా కార్యకర్త ఉపేంద్ర, పంచాయతీ కార్యదర్శి బాబు  ఉన్నారు.
Spread the love