పార్టీని కాపాడితే పరాభవించారు: డాక్టర్ అజ్మీర ప్రహ్లాద్.

నవతెలంగాణ-గోవిందరావుపేట
2003 నుండి పార్టీని కాపాడినందుకు పరాభవించారని డాక్టర్ అజ్మీర ప్రహ్లాద్ అన్నారు. సోమవారం మండలంలోని పలువురు నాయకులతో జరిగిన సమావేశంలో మాట్లాడారు2003 వ సంవత్సరం నుండి 2018-19 వరకు మాజీ మంత్రివర్యులు అజ్మీర చందూలాల్ వారి కుమారుడైన నేను నాతోపాటు అనేకమంది ఉద్యమకారులు అనేక పోరాటాలు చేసి  తెలంగాణ ఆవిర్భావం తర్వాత కూడా మంత్రిగా అభివృద్ధి చేసి కార్యకర్తలను కంటికి రెప్పల కాపాడుకున్నానని అన్నారు. కొందరు సీనియర్ నాయకులు ఈ ఏరియాపై అనుభవం లేని వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని నమ్మి నేడు టికెట్టు నిరాకరించి పరాభవించారని అన్నారు. టికెట్ నిరాకరణకు సరైన కారణం చెప్పి ఉంటే ఎవరికి టికెట్ ఇచ్చినా భారీ మెజార్టీతో గెలిపించే వాళ్ళమని అన్నారు. అలా కాకుండా రాజకీయాలు అంటే అనుభవం లేని వాళ్లకు తెలంగాణ ఉద్యమం గురించి తెలియని వాళ్లకు  కేవలం సెంటిమెంట్ ఆధారంగా టికెట్ ఇచ్చి 2003 నుండి పార్టీలో ఉన్న నాయకులను చులకనగా చూశారని అన్నారు. నక్సల్ వర్సెస్ నక్సల్ అంటూ వైశ్యామ్యాన్ని పెంచి పోషించారన్నారు. తనను తాను నిరూపించుకునేందుకు  మరియు నాతో పాటు ప్రభావానికి గురి అయిన వాళ్లకు మంచి అవకాశాలు అందించాలన్న సంకల్పంతో బిజెపి పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ఈనెల 12న హైదరాబాదులో పార్టీలో చేరే కార్యక్రమానికి ప్రధాన నాయకులు కలిసి రావాలని సూచించారు. త్వరలోనే ములుగు నియోజకవర్గ పరిధిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి తన లక్ష్యాన్ని వివరించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పలు రాజకీయ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love