టీజీసీజీటీఏ రాష్ట్ర అధ్యక్షునిగా డాక్టర్‌ కె.భాస్కర్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ గవర్నమెంట్‌ గెజిటెడ్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా (టీజీసీజీటీఏ) డాక్టర్‌ కె.భాస్కర్‌ ఎన్నికయ్యారు. శనివారం ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. సిటీ కాలేజీలో రాజనీతి శాస్త్రంలో సహాయ ఆచార్యులుగా ఆయన పని చేస్తున్నారు. టీజీసీజీటీఏలోని పలు పోస్టులకు ఏప్రిల్‌ 30న ఎన్నికలు జరిగాయి. కానీ, అధ్యక్ష ఎన్నిక ఫలితాన్ని కొన్ని సాంకేతిక కారణాలతో ఎన్నికల అధికారి వాయిదా వేశారు. అన్ని అంశాలు పరిశీలించాక డాక్టర్‌ భాస్కర్‌ ఎన్నికైనట్టు ఎన్నికల అధికారి డాక్టర్‌ డి.విద్యాధర్‌ ప్రకటించారు. భాస్కర్‌ గతంలో నల్లగొండ జిల్లా అధ్యక్షునిగా, స్టేట్‌ అసోసియేట్‌ అధ్యక్షునిగా పనిచేశారు. ఈ సందర్భంగా భాస్కర్‌ మాట్లాడుతూ సంఘ ప్రాథమిక సభ్యుల సంక్షేమం కోసం పనిచేస్తానని కోరారు. కాగా ఎన్నిక పట్ల సీనియర్‌ నాయకులు ఏ.సంజీవయ్య, ఈ.యాదయ్య, బాలశ్రీనివాస్‌, విప్లవ్‌ దత్‌ శుక్ల, శంకర్‌ నాయక్‌ , వై వేణుప్రసాద్‌, డా.ఎమ్‌. ఏ. మాలిక్‌, శ్రీమతి ఎన్‌ సుభాషిణి, డా.ఎమ్‌ సోమయ్య,పి రవి కుమార్‌,సి బీరయ్య, వేముల కామేశ్వరరావు, డా. వాసం శ్రీనివాస్‌, డా. ఆకుల వెంకటేశం, గాజుల సదయ కుమార్‌,డా. చేగోని రవి కుమార్‌ జి పరమేష్‌, జి.హృదయ రాజు, ఆర్‌ వెంకట రామారావు తదితర్లు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

Spread the love