వర్షపు నీరు నిలువ లేకుండా చూడాలి: డాక్టర్ సుకుమార్

నవతెలంగాణ-గోవిందరావుపేట
తమ ఇంటి పరిసరాలలో వర్షపు నీరు నిలువ లేకుండా చూసుకోవాలని మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రధాన వైద్యాధికారి డాక్టర్ సుకుమార్ అన్నారు.
గురువారం మండలంలోని మచ్చాపూర్ గ్రామంలో పిహెచ్సి గోవిందరావుపేట ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో 71 మంది ని పరీక్షించి మందులు ఇవ్వడం జరిగిందని వీరిలో పదిమంది జ్వర పీడితులుగా గుర్తించి చికిత్స అందించినట్లు తెలిపారు. పనికిరాని వస్తువులు పాత్రల వర్షపు నీరు నిలువ ఉన్నట్లయితే దోమలు చేరి మలేరియా డెంగు జ్వరాలు ప్రభలే అవకాశం ఉందని వీధుల వెంట తిరుగుతూ పనికిరాని వస్తువులలో నిలువ ఉన్న నీటిని గ్రామస్తులు సిబ్బంది సహాయంతో పారబోశారు. వర్షాకాలం తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో సి.హెచ్.ఓ సదానందం సురేష్ బాబు పి హెచ్ ఎన లక్ష్మి  హెల్త్ అసిస్టెంట్లు జంపయ్య కృష్ణయ్య ఏఎన్ఎం వెంకట నరమ్మ ఆశా కార్యకర్త రజిత తదితరులు పాల్గొన్నారు.
Spread the love