ఆడలేక మద్దెల ఓడా అంటున్నావా డ్రామారావు : రేవంత్‌

Are you saying that you can't play? Drama Rao: Revanth– ట్వీట్‌ వార్‌…
నవతెలంగాణబ్యూరో -హైదరాబాద్‌
‘నీకు రైతులపై ప్రేముంటే, నవంబర్‌ రెండులోపు రైతుబంధు డబ్బులు ఇవ్వు. నీకు వృద్దులపై శ్రద్ధ ఉంటే ఫించన్‌ ఇవ్వు. నీకు ఉద్యోగులపై బాధ్యత ఉంటే అదే సమయానికి ఉద్యోగులందరికి జీతాలు ఇవ్వు. ఈ విషయాలనే తాము కేంద్ర ఎలక్షన్‌ కమిషన్‌కు చెప్పాం’ అని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ ట్వీట్‌ చేశారు. ఇదే నీలాంటి వాడిని చూసే… ‘నిజం చెప్పులు తొడుక్కునే లోపే… అబద్ధం ఊరంతా తిరిగొస్తుంది’ అనే సామెత పుట్టింది. ఆడలేక మద్దెల ఓడు అంటున్నావా డ్రామారావు అని ఎద్దేవా చేశారు. డ్రామాలు ఆపి, నవంబర్‌ రెండు లోపు లబ్ధిదారులకు నిధులు ఇవ్వు… లేదంటే కాంగ్రెస్‌ వచ్చిన తర్వాత పెంచిన మొత్తంతో కలిపి ఇస్తుందని తెలిపారు.
కారుకూతల కవిత గారు
‘మీరు ఇంతకన్నా దిగజారరు అనుకున్న ప్రతిసారీ ఇంకా దిగజారుతూనే ఉంటారు. మాటల్ని వక్రీకరించడంలో, అసలు సమస్యలను పక్కదారి పట్టించ డంలో మీ ‘స్కామ్లీ’లో ఎవరూ ఎవరికీ తీసిపోరు. రైతుల సంక్షేమం కాంక్షించే ఏకైక పార్టీ కాంగ్రెస్‌. రైతు పెట్టుబడి సాయాన్ని మీ రాజకీయ అవసరాల దృష్ట్యా ఆలస్యం చేయకుండా, రైతుల అవసరం దృష్ట్యా అందజే యాలన్నదే కాంగ్రెస్‌ ప్రధాన డిమాండ్‌. మీకు రైతులపై కాస్తయినా చిత్తశుద్ధి ఉంటే మా నాయకులు రేవంత్‌ రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి డిమాండ్‌ చేసిన విధంగా, నవంబరు రెండు లోపు రైతులందరికి పెట్టుబడి సాయం విడుదల చేయండి. ఇకనైనా మీరు ఇలాంటి చిల్లర మల్లర రాజకీయాలను ఆపి, గత పదేండ్లలో రైతులకు ఏం చేశారో చెప్పి ఎన్నికల్లో పోరాడండి’ అంటూ కాంగ్రెస్‌ పార్టీ తన ట్వీట్‌ వేదికగా ఎమ్మెల్సీ కవితకు సూచించింది.

Spread the love