– టెక్నికల్ అసిస్టెంట్లకు షోకజు నోటీసులు -డిఆర్డిఓ చిన్న ఓబులేసు
– అవకతవకలు కప్పిపుచ్చే విధంగా ఈజీఎస్ సిబ్బంది జిల్లా అధికారులను బ్రతిమిలాట
నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల మండలంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 2023 మార్చి నుండి 2024 మార్చి వరకు ఒక సంవత్సరం గాను 13వ విడత సామాజిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ముందు డిఆర్డీఓ చిన్న ఓబులేసు ఆధ్వర్యంలో ప్రజావేదిక నిర్వహించారు. 4 కోట్ల 66 లక్షల నిధులకు ఆడిట్ నిర్వహించగా టెక్నికల్ అసిస్టెంట్ల తప్పిదాలు అవగాహన లేని ఫీల్డ్ అసిస్టెంట్లు వల్ల కూలీలు చేసిన పని కన్నా అదనంగా డబ్బులు చెల్లింపు విషయంలో అవకతవకలు చోటుచేసుకున్నాయని డిఆర్డిఓ తెలిపారు. అందుకుగాను 61 వేలు రికవరీ 1లక్ష 19వేలు పెనాల్టీ ద్వారా మొత్తము 1 లక్ష 80 వేలు అవకతవకలు జరిగినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఆయన మాట్లాడారు ఎన్ఐసి సెక్యూర్ సాఫ్ట్వేర్ ద్వారా ఎలాంటి అవకతవకలు జరిగిన తెలిసిపోతుంది అన్నారు. అవగాహన లోపంతో కూలీలకు అదనపు బిల్లులు చెల్లించారు. దానికి గాను టెక్నికల్ అసిస్టెంట్లకు షోకస్ నోటీసులు జారీ చేస్తున్నామన్నారు. జిల్లాలో పండ్ల తోటలకు అధిక ప్రోత్సాహం అందించి ఆర్టికల్చర్ను ముందుంచే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 1000 ఎకరాలకు టార్గెట్ పెట్టుకుంటే ఇప్పటికే 700 ఎకరాలకు చేరుకున్నామన్నారు. కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ నాగేందర్, క్యూసి కృష్ణారెడ్డి, డిస్టిక్ విజిలెన్స్ ఆఫీసర్స్ అర్జున్ రెడ్డి,నజీర్, ఎంపీడీవో మోహన్ లాల్, ఎస్ఆర్పి ముత్తయ్య, ఏపీవో సుదర్శన్ గౌడ్,టెక్నికల్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.