‘పెద్దవంగర’లో తాగునీటి అవస్థలు..

పది రోజులుగా పనిచేయని తాగునీటి బోరు
మరమ్మతులు చేయించాలని వేడుకోలు

నవతెలంగాణ – పెద్దవంగర
అస్సలే వేసవి కాలం, దీనికి తోడు బుక్కెడు తాగునీరు అందక పెద్దవంగర గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామానికే పెద్దదిక్కు మారిన పశువుల దావఖాన సమీపంలోని తాగునీటి బోరు గత పదిరోజుల క్రితం మరమ్మతుకు గురైంది. గతంలో మరమ్మతులు చేసిన, మళ్ళీ కూడా పని చేయకపోవడంతో తాగునీటి కోసం ప్రజలు అల్లాడిపోతున్నారు. దీంతో భగభగ మండే ఎండల్లో వ్యవసాయ బావులు, బోర్ల వద్దకు వెళ్లి తెచ్చుకోవాల్సిన దుస్తితి ఏర్పడిందని వాపోతున్నారు. మరో వైపు గ్రామంలోని డబుల్ బెడ్ రూం ఇండ్లకు సరిగా తాగడానికి మిషన్‌ భగీరథ నీళ్లు అందక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. మరికొన్ని గ్రామాల్లో వాటర్ మెన్ లు అలసత్వం కారణంగా తాగునీటి కోసం ప్రజలు తండ్లాడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని కోరుతున్నారు.
Spread the love