మతోన్మాద శక్తులను తరిమికొట్టండి!

– ప్రజాస్వామ్య ,లౌకిక, సామాజిక , పార్టీలను బలపరచండి
– విలేకరుల సమావేశంలో జిల్లా సీపీఐ(ఎం) నాయకులు కె. శ్రీనివాస్‌, యు.బుగ్గప్ప,
నవతెలంగాణ-యాలాల
మతోన్మాద పార్టీలను తరిమికొట్టి ప్రజాస్వామ్య లౌకిక సామాజిక పార్టీలను బలపర్చవలసిన అవసరం ఉందని జిల్లా సీపీఐ(ఎం) నాయకులు కె. శ్రీనివాస్‌, యు.బుగ్గప్ప అన్నారు. మండల కేంద్రంలో సోమవారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. అదేవిధంగా ఎన్నికలలో పోటీ చేస్తున్న వారందరూ కార్మికుల సమస్యలను పరిష్కరించే విధంగా కార్మికుల పక్షాన నిలబడే విధంగా మాత్రమే బలపరచవలసిన అవస రం ఉందన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా తమ సమస్యల పరిష్కా రం కోసం అనేక సందర్భాల్లో ఆందోళన పోరాటాలు నిర్వహించడం జరిగిందని గుర్తు చేశారు. కాబట్టి అలాంటి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ ఉద్యోగ గుర్తింపు, ఉద్యోగ భద్రత, తదితర సమస్యల మీద పోటీ చేస్తున్న అభ్యర్థులు మాట్లాడవలసిన అవసరం తప్పనిసరిగా ఉందన్నారు. ఎన్నికల అనంతరం ప్రజలకు కార్మికులకు అమలు చేయకుంటే ఉద్యోగ, కార్మిక, ప్రజా పోరాటాలను ఉధతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఉప్పలి మల్కయ్య, రమేష్‌, రాములు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love