నవతెలంగాణ-హైదరాబాద్ : ఆఫ్రికా దేశం సూడాన్‌లోని ఆస్పత్రిపై డ్రోన్ దాడి కలకలం రేపింది. ఈ దాడిలో ఏకంగా 30 మంది మరణించగా పదుల సంఖ్యలో గాయపడినట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. 2023 ఏప్రిల్ నుంచి ఈ దేశంలో సూడాన్ ఆర్మీకి అక్కడ రాపిడ్ ఫోర్స్‌కి మధ్య యుద్ధం కొనసాగుతోంది. కొన్ని వారాల క్రితం ఆస్పత్రిపై ఇదే తరహా డ్రోన్ దాడి జరిగినట్లు వైద్య వర్గాలు పేర్కొన్నాయి.