పల్లె ప్రకృతిపై పర్యవేక్షణ కరువు

– నాటిన సమయంలో ఉన్న… ఉత్సాహం పర్యవేక్షణ బాధ్యత లేకపాయ ?
– చేసిన పనులకే బిల్లులు రాలేదు
– ఖాళీ ప్రదేశంలో మొక్కలు నాటిన వైనం
– మండల కేంద్రంలో గ్రామపంచాయతీ అధికారుల నిర్లక్ష్యమే : గ్రామస్తులు
గత బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా హరితహారం పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టింది. గత ప్రభుత్వంలో ప్రతి గ్రామపంచాయతీలో నర్సరీని ఏర్పాటు చేసి, ప్రకృతి వనం ఏర్పాటు చేసింది. అదేవిధంగా బృహత్‌ పల్లె ప్రకృతి వనం పెద్ద గ్రామపంచాయతీలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రకృతి వనాల పేరుతో లక్షల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేశారు. గ్రామపంచాయతీ, జాతీయ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల భాగస్వామ్యంతో లక్షలాది మొక్కలు నాటించి, నాటిన మొక్కలు లెక్కలకే పరిమితం తప్ప వాటి సంరక్షణపై అధికారుల పర్యవేక్షణ కరువైంది సమయంలో ఉన్న ఉత్సాహం లేకపోవడంతో ప్రకృతి వనాల్లో నాటిన మొక్కలు, ఎండి పోవడం వల్ల కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవు తుందని ఆయా గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నవతెలంగాణ- వీపనగండ్ల
మండలంలో 14 గ్రామపంచాయతీలో సుమారు ఎకరా పొలంలో 14 పల్లె ప్రకృతి ఏర్పాటు చేశారు. అదే విధంగా మండల కేంద్రం వీపనగండ్లలో ఐదు ఎకరాలల కేటాయించారు. 24 లక్షలు కేటాయించి వాటి నిర్వహణకు 10లక్షల 19 వేల రూపాయలు ఖర్చయినట్లు, గోపాల్‌ దీన్నేలో 5 ఎకరాలు కేటాయించారు.24 లక్షలు మంజూరు కాగా 12లక్షల69 వేల రూపాయలు ఖర్చయి నట్లు కల్వరాలలో 5 ఎకరాలు కేటాయించారు.24 లక్షలకు గాను 13 లక్షల 18 వేల రూపాయలు ఖర్చయినట్లు పుల్గర్చర్లలో 5 ఎకరాలు కేటాయించారు.24 లక్షల గాను 5 లక్షల 60 వేల రూపాయలు ఖర్చు అయినట్లు, తూముకుంటలో పది ఎకరాలు కేటాయించారు. సుమారు 42 లక్షలు కేటాయించగా 16 లక్షల 40 వేల రూపాయలు బృహత్‌ పల్లె ప్రకృతి వనం ఏర్పాటు, చేయడానికి ఖర్చయినట్లు అధికారులు పేర్కొంటున్నారు.2021 సంవత్సరంలో లక్షలలో మొక్కలు నాటారు. వాటి నిర్వహణ ఏడాది పాటు ఉపాధి హామీ అధికారులు పర్యవేక్షణ చేశారు. ఏడాది దాటిన తర్వాత గ్రామపంచాయతీ అధికారులకు నిర్వహణ అప్పచెప్పారు. వీపనగండ్ల బృహత్‌ పల్లె ప్రకృతి వనంలో మొక్కలు ఎండిపోకుండా ఉండేందుకు విద్యుత్‌ సౌకర్యంతో పాటు బోరు వేసి మోటర్‌ అమర్చరని తెలిపారు. తూముకుంటలో బోరు వేసి వదిలేశారు. గోపాల్‌ దీన్నే, పుల్గర్‌ చర్ల, కల్వరాల్ల గ్రామాల్లో మాత్రమే బృహత్‌ పల్లె ప్రకృతి వనాలు 70శాతం మొక్కలు ఎండిపోకుండా ఉన్నాయి. వీపనగండ్లలో 20శాతం మొక్కలు కూడా లేవు. తూముకుంట మొక్కలు ఎదిగిన తర్వాత వాటి నిర్వహణ, నీటి వసతి లేకపోవడంతో వెళ్లిపోవడం జరిగింది. దీంట్లో 30 శాతం మొక్కలు సరిగా లేవు. ప్రతి సంవత్సరం గ్రామ పంచాయతీలో, ప్రభుత్వ కార్యాలయంలో ప్రధాన రహదారులు, ఖాళీ ప్రదేశంలో మొక్కలు నాటారు. కొన్ని గ్రామాల్లో మొక్కలు ఉన్నాయి. కొన్ని గ్రామాలలో రక్షణ లేకుండా,పర్యవేక్షణలేకపోవడంతో ఎండిపోవడం జరిగింది. మండల కేంద్రంలో గ్రామపంచాయతీ అధికారుల నిర్లక్ష్యంగామొక్కలు పూర్తిగా ఎండిపోవడం,లక్షల రూపాయలు ఖర్చుపెట్టి బోరు బోరు వేసి మోటర్‌ అమర్చిన చెట్లకు నీళ్లు పట్టే నాధుడు కరువయ్యారు అన్ని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. వర్షాకాలంలో నాటాల్సిన మొక్కలు జనవరి, ఫిబ్రవరి నెలలో నాటడం వల్ల మొక్కలు ఇరగలేదని, కొన్ని ఎదిగిన మొక్కలు కూడా ఈ సంవత్సరం వర్షాకాలంలో వర్షాలు సరింగా కురువకపోవడం నీటి ఎద్దడి వలన మొక్కలు ఎండిపోయినట్లు అధికారులు చెప్తున్నారు. గ్రామాలల్లో మొక్కలు ఎండిపోకుండా గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌ ద్వారా నీళ్లు పోస్తా ఉన్న ఎండ వేడిమికి మొక్కలు బతకడం లేదని గ్రామ స్థాయి అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం మొక్కల నిర్వహణకు లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు చెబుతున్న ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడంలేదని, లక్షలాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని మండల ప్రజలు మండల వ్యక్తం చేస్తున్నారు.

చేసిన పనులకే బిల్లులు రాలేదు
వీపనగండ్లలో బృహత్‌ పల్లె ప్రకృతి వనంలో చేసిన పనులకు మాత్రం బిల్లులు రాలేదని నాటిన మొక్కలు ఎండిపోతే ఏం చేయాలని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు.
– నరేష్‌ గౌడ్‌ వీపునగండ్ల పంచాయతీ కార్యదర్శి

అధికారుల పర్యవేక్షణ కరువు
ప్రభుత్వ ఆదేశాను సారం హడావిడిగా మొక్కలు నాటిస్తారు. కానీ వాటి నిర్వహణ, రక్షణ పై అధికారుల సమన్వయ లోపంతో మొక్కలు ఎండి పోతున్నాయి. గ్రామాలలో ఆశించిన స్థాయిలో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు.
– కృష్ణయ్య, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు

Spread the love