రాష్ట్రంలో డ్రగ్స్‌ కల్చర్‌ : బీఎస్పీ

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో డ్రగ్స్‌ కల్చర్‌ పెరుగుతున్నదనీ, దాన్ని అరికట్టడంలో సీఎం కేసీఆర్‌ పూర్తిగా విఫలమయ్యారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌.ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఆరోపించారు. గురువారం ముస్లీం యునైటెడ్‌ ఫెడరేషన్‌ (ఎంయూఎఫ్‌) అధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ ధర్నాచౌక్‌లో డ్రగ్‌, మర్డర్‌ కల్చర్‌తోపాటు అధిక వడ్డీ వసూళ్లకు వ్యతిరేకంగా నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌ నగరంలో మత్తు పదార్థాల సరఫరా వ్యాపారం రూ.కోట్లల్లో జరుగుతున్నదన్నారు. దీన్ని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. సెలబ్రేటీలు, రాజకీయ నాయకులు, విద్యార్థులు,యువత మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి ఐటీ మంత్రి కేటీఆర్‌ పై డ్రగ్స్‌ తీసుకుంటున్నారనే ఆరోపణలున్నాయని తెలిపారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై ఉన్న శ్రద్ధ, మత్తు పదార్థాలను కంట్రోల్‌ చేయడంలో లేదని ఆరోపించారు.

Spread the love