ఓయూలో డ్రగ్ ఫ్రీ క్యాంపస్ – డ్రగ్ ఫ్రీ తెలంగాణ నినాదంతో 2k రన్ ..

Drug free campus in OU - 2k run with the slogan Drug Free Telangana..నవతెలంగాణ – ఓయూ
స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో ఉదయం ఆర్ట్స్ కాలేజీ నుండి NCC గేట్ వరకు 2k రన్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో ముఖ్య అతిథి గా క్షేత్ర సంఘటన మంత్రి చిరిగే శివకుమార్ పాల్గొని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. స్వామి వివేకానంద ఈ దేశ యువతకి ఆదర్శమని, ఏబీవీపీ గత 75 సంవత్సరాలుగా స్వామి వివేకానంద చూపిన బాటలో నడుస్తుందని అన్నారు. ప్రపంచ దేశాలు భారత దేశ సంస్కృతిని చూసి నవ్వుకుంటున్న తరుణంలో భారత దేశ సంస్కృతి సంప్రదాయాలను విశిష్టతను ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మహోన్నతమైన వ్యక్తి స్వామి వివేకానంద అటువంటి గొప్ప వ్యక్తి యొక్క జయంతిని పురస్కరించుకొని ఉస్మానియా యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “డ్రగ్ ఫ్రీ క్యాంపస్ – డ్రగ్ ఫ్రీ తెలంగాణ” కార్యక్రమాన్ని అభినందిస్తూ నేటి యువత గంజాయికి డ్రగ్స్ కి అలవాటు పడి తమ యొక్క జీవితాన్ని కుటుంబాన్ని రోడ్డున పడేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దేశ యువత ఈ దేశం యొక్క భవిష్యత్తు, సంపద మన యొక్క శక్తిని ఈ దేశాన్ని ప్రపంచంలో విశ్వ గురువుగా మలచడంలో ఉండాలని ఆశించారు. వారు వెంటనే జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర సంఘటన మంత్రి లవన్ కుమార్, హైదరాబాద్ మహానగర సంఘటన మంత్రి రాజశేఖర్, హైదరాబాద్ మహానగర ప్రముఖ్ డాక్టర్. రామకృష్ణ, హైదరాబాద్ సిటీ సెక్రటరీ పృధ్వీ తేజ, జాతీయ కార్యవర్గ సభ్యులు జీవన్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అలివేలి రాజు, జిల్లా కన్వీనర్ హరిప్రసాద్, యూనివర్సిటీ అధ్యక్షడు దృహన్, కార్యదర్శి శివశంకర్ విద్యార్థి నాయకులు శ్రీధర్, కోటి, హరిప్రసాద్, శేఖర్, కళ్యాణ్, నిఖిల్, రాజశేఖర్, శివశంకర్, సందీప్, చైతన్య, శ్రీకర్, సాయితేజ, మహేష్  విద్యార్థులు, ప్రొఫెసర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్ పాల్గొన్నారు.
Spread the love