
నార్కోటిక్ పోలీసులు పంజాగుట్ట పోలీసుల ఆపరేషన్ లో నిన్న సాయంత్రం భారీగా డ్రగ్స్ అమ్ముతున్న నైజీరియన్ వ్యక్తిని అరెస్ట్ చేశారు.నిందితుడి వద్ద నుండి భారీగా డ్రగ్స్ పట్టుకున్నమని వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. మంగళవారం పొంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని సోమవారం పక్క సమాచారం మేరకు సోమవారం మధ్యాహ్నం సమయంలో ఓ హోటల్ వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకున్నామనీ అన్నారు.హైదరాబాద్ వచ్చిన నైజీరియన్ వ్యక్తి డ్రగ్స్ అమ్ముతున్నట్లు పక్క సమచారం రావటంతో నార్కోటిక్ పోలీసులు పంజాగుట్ట పోలీసుల సంయుక్తంగా కలిసి నైజీరియాకి చెందిన స్టాంలే ఊదొక,అనే వ్యక్తిని అరెస్ట్ చేశామన్నారు. 2019 నవంబర్లో బిజినెస్ వీసా పై ముంబై వచ్చిన నిందితుడు ముంబైలో రెడీమేడ్ క్లాత్స్ బిజినెస్ చేస్తు ఉండేవాడన్నారు.ఆ తరువాత బిజినెస్ పై గోవా వచ్చి నైజీరియన్ వ్యక్తులతో పరిచయం పెంచుకుని డ్రగ్స్ కన్జయుమ్ చేసాడన్నారు.ఎక్కువ డబ్బులు సమదించడంతో దీనిని వృత్తిగా ఎంచుకున్నడనీ గోవా పోలీసులు గతంలో అరెస్ట్ చేశారని అన్నారు.2014 లో ఇండియాకి చెందిన మహిళను పెళ్లి చేసుకొని పాస్పోర్ట్ తో పాటు దేశ పౌరసత్వం స్వీకరించి అన్ని రకాల ప్రభుత్వ కార్డులను పొందిన నిందితుడు కోవిడ్ సమయంలో ఈ డ్రగ్స్ దందాకు తెరలేపాపిన నిందితుడిని ఆ సమయంలో కొందరు వ్యక్తులు సప్లైర్గా వినియోగించుకున్నరని వివరించారు. 2017 లో నార్కోటిక్ డ్రగ్స్ పెడలింగ్ చేస్తున్నప్పుడు ఆ కేసులో జైలు వెళ్ళాడనీ గుర్తుచేశారు. దేశంలోని ట్రై సిటీస్గా పేరుగాంచిన ముంబై,గోవా,పూణే లోనున్న డ్రగ్స్ సప్లైర్తో సంబంధాలు పెట్టుకున్నట్లు తెలిందన్నారు. కొరియర్ ద్వారా డ్రగ్స్ తెప్పిచుకొని కష్టమరస్ సప్లయ్ చేస్తున్నారని విచారణలో వెల్లడైందన్నారు. 500 మంది వివిధ రాష్టలలో కస్టమర్లు ఉన్నట్టు సమాచారం ఉందనీ కాంజ్యుమర్స్ నెట్ వర్క్ పై ఫోకస్ పెట్టామన్నారు.కొకైన్ 557 గ్రాములు, Ecstasy pills 390 గ్రాములు 21 హెరాయిన్గ్రాములు,45 గాంజ గ్రాముల, 3బ్లాట్స్గ్రాముల LSD,215 గ్రాములు Charas 7 గ్రాములు Amphetamine,190 గాంజా,8,సెల్ ఫోన్స్ 5,40,000 లక్షల నగదు మొత్తం 8 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ప్రజాభవన్ ముందు యాక్సిడెంట్ కేసులో A3 గా ఉన్న బీఆరెస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పరారీలో ఉన్నాడనీ చెప్పారు.రాహిల్, షకీల్ ఇద్దరు దుబాయ్లో ఉన్నట్లు మాకు సమాచారం ఉందన్నారు. ప్రధాన నిందితుడు రాహిల్తో పాటు మాజీ ఎమ్మెల్యే షకీల్ పై కూడా లుక్ ఔట్ నోటీసులు జారీ చేశామన్నారు.ఈ కేసులో ఇప్పటివరకు ముగ్గురిని అరెస్ట్ చేశామన్నారు. పంజాగుట్ట మాజీ ఇన్స్పెక్టర్,బోధన్ మాజీ ఇన్స్పెక్టర్ లను అరెస్ట్ చేసి జడ్జ్ ముందు ప్రొడ్యూస్ చేశాం వారిద్దరికి పర్సనల్ బాండ్పైన కోర్టు బెయిల్ మంజూరు చేసింది.కాగా ఈ కేసులో మొత్తం 16 మంది పై కేసు నమోదు చేశామనీ నిందితులకు పోలీసులుసహకరించినట్లు గుర్తించామన్నారు. ఈ కేసులో నిందితులకు సహకరించిన వారిపై కేసులు నమోదు,జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో మార్చ్ 2022 లో యాక్సిడెంట్ జరిగిందన్నారు. ఈ యాక్సిడెంట్లో ఒక బాబు చనిపోయాడనీ ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్ని తప్పించారనే వార్తలు వచ్చాయన్నారు.ఆ కేసును కూడా తిరిగి విచారణ చేస్తామన్న ఆయన కోర్టులో ట్రయల్ జరుగుతుందనీ అన్నారు.