నవతెలంగాణ – తొగుట
రోడ్డు ప్రమాదాల నివారణ గురించి ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహిస్తున్నామని ఎస్సై రవికాం తారావు తెలిపారు. గురువారం విలేకరుల సమావేశంలో ఎస్ఐ మాట్లాడుతూ గత కొన్ని రోజుల క్రితం తొగుట పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాలు తనిఖీ చేశామన్నారు. ఈ తనిఖీలలో 6 మంది వ్యక్తులు మద్యం సేవించి వాహనాలు నడుపుతుండగా పట్టుకొని బ్రీత్ ఎనలైజర్ తో తనిఖీ చేయగా మద్యం సేవించి ఉన్న ట్లుగా నిర్ధా రణ అయిందని అన్నారు. వారిని సిద్ది పేట ప్రిన్సి పల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ శ్రావణి యాదవ్ ముందు హాజరు పరిచామన్నారు. విచా రణ చేసి 6 మందికి రూ. 6,500/- జరి మాన, ముగ్గురు వ్యక్తులకు ఒకరోజు జైలు శిక్ష విధించిన ట్లు తెలిపారు. మద్యం సేవించి వాహ నాలు నడ పవద్దన్నారు. రోడ్డు నిబంధనలు, ట్రాఫిక్ నిబంధ నలు పాటిస్తూ వాహనాలు నడపాలని సూచించా రు. రోడ్డు ప్రమాదాల నివారణ గురించి మాత్రమే ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తు న్నామని పేర్కొన్నారు.