మద్యం మత్తులో లారీ డ్రైవర్ భీభత్సం..

నవతెలంగాణ – సిద్దిపేట: మద్యం మత్తులో ఓ లారీ సిద్దిపేట జిల్లా కేంద్రంలో భీభత్సం సృష్టించాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..కోదాడకు చెందిన లారీ డ్రైవర్ సరుకులు దింపి తిరిగి వెళ్తున్న క్రమంలో సిద్దిపేట పట్టణంలోని బీజేఆర్ చౌరస్తాలో లారీ ఓవర్ స్పీడ్ తో అదుపు తప్పింది. బీజేఆర్ చౌరస్తాలో గల బాబు జగ్గీవన్ రామ్ విగ్రహం చుట్టూ ఏర్పాటు చేసిన ఫౌంటేన్ లోకి లారీ దూసుకెళ్లింది. ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో పరిసర ప్రాంతంలో జనాలు లేకపోవడంతో పేను ప్రమాదం తప్పింది. లారీ డ్రైవర్ మద్యం మత్తులో, అదికూడా అతివేగంగా వాహనం నడపడం వల్లే ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు ఆరోపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Spread the love