శనగ పంటకు ఒకపక్క ఎండు తెగుళ్లు

– శనగ పంటకు ఒకపక్క ఎండు తెగుళ్లు మరోపక్క వాతావరణంలో మార్పు తో చీడపురుగుల బెడద ఆందోళనలో రైతన్న

నవతెలంగాణ- మద్నూర్
మద్నూర్ మండలంలో అత్యధికంగా సాగుచేసిన శనగ పంటకు ఎండు తెగుళ్ల బెడద అధికంగా కనిపిస్తుంది. ఇది ఇలా ఉండగా మరోపక్క గత రెండు రోజులుగా వాతావరణంలో పూర్తిగా మార్పు కనిపించడంతో చీడపురుగుల బెడద పంటలపై అధికమవుతుందని మండల రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రబ్బి పంట సాగులో భాగంగా మండలములో శనగ పంట అత్యధికంగా వేశారు. ఈ పంటకు ఎండు తెగుళ్లు రావడంతో పంట చనిపోతుంది. ఎండు తెగుళ్ల నివారణ కోసం పురుగు మందులు పిచికారి చేసినప్పటికీ వాతావరణం చల్లగా మబ్బులు గా ఉండడం వర్షా సూచన కనిపించడం ఇలాంటి వాతావరణంతో అన్ని రకాల పంటలపై చీడపురుగుల బెడద అధికమైందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేసుకుంటున్నారు. వాతావరణం మబ్బులుగా చల్లగా ఉండడం పంటలపై చూపిన చీడపురుగుల నివారణ కోసం పిచికారి మందులు కూడా వాడలేని పరిస్థితి ఉందని పురుగుల నివారణ కోసం వాతావరణం ఎండగా ఉంటేనే పురుగులు నివారించుకోవచ్చని వాతావరణ మబ్బులు గా ఉండి చల్లటి వాతావరణంతో దోమ లాంటి వర్షం కురిసే అవకాశం ఉన్నందున పిచికారి మందులు వేయలేని పరిస్థితి ఉన్నందున చీడపురుగుల బెడదతో పంటలు పెద్ద మొత్తంలో నష్టపోతున్నాయని రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కంది పంట పైన శనగ పంట పైన పురుగుల బెడద అధికంగా ఉన్నట్లు రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణం ఇలాగే ఉంటే పంటలు భారీగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయని రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇటు ఎండు తెగుళ్లు నివారణ కోసం అటు మబ్బులతో చల్లటి వాతావరణం నెలకొనడం చీడపురుగుల బెడద అధికం కావడం తెగుళ్ల నివారణ చీడపురుగుల నివారణ కోసం వ్యవసాయ శాఖ అధికారులు ఇలాంటి పరిస్థితుల్లో పంటలు కాపాడుకునేందుకు సలహాలు సూచనలు అందించి రైతన్నలకు ఆదుకోవాలని మండల వ్యవసాయ రైతులు కోరుతున్నారు.
Spread the love