ఫోటో గ్యాలరీని ప్రారంభించిన డీఎస్ డీవో చంద్రకళ 

నవతెలంగాణ- కంటేశ్వర్

పార్టిషన్ హర్రర్ రిమెంబరెన్స్ డే పురస్కరించుకుని ఎస్ బిఐ నిజామాబాద్ మెయిన్ బ్రాంచ్ లో సోమవారం ఫోటో గ్యాలరీని సోమవారం ప్రదర్శించారు. ఈ గ్యాలరీని సోషల్ వెల్పేర్ డెవలప్ మెంట్ ఆఫీసర్ చంద్రకళ హాజరై ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలనుసారం 52 ఫోటో ప్రేమ్ లతో కూడిన ఫోటో గ్యాలరీ ప్రజల సందర్శనార్ధం ప్రదర్శించినట్లు, మంగళవారం కూడా ఈ ప్రదర్శన ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డీఎస్ డీవో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ బిఐ రీజినల్ ఆఫీస్ చీఫ్ మేనేజర్ బి. రవి, హెచ్ ఆర్ మేనేజర్ రాజన్న, ఎస్ బిఐ నిజామాబాద్ చీఫ్ మేనేజర్ నవీన్ దేశ్ పాండే, మేనేజర్ జి.శ్రీనివాస్, ఇతర సిబ్బంది, ఖాతారులు పాల్గొన్నారు.
Spread the love