దుబ్బాక ట్రెస్మా మండల అధ్యక్షుడికి సన్మానం 

నవతెలంగాణ-దుబ్బాక రూరల్ : ఇటీవల తెలంగాణ రాష్ట్ర బీసీకమిషన్ చైర్మన్ శ్రీ కృష్ణ మోహన్ రావ్, సుప్రసిద్ధ కవి గాయకులు జయరాజు గారి చేతుల మీదుగా దుబ్బాక ట్రెస్మా మండల అధ్యక్షులు రవీందర్ ఉపాధ్యాయ రత్న అవార్డు (2023 )ను హైద్రాబాద్ లో పొందారు. ఐతే వారినీ మంగళవారం సిద్దిపేట జిల్లా ఎస్ఎఫ్ఐ ఉపాధ్యక్షులు ఎండీ సాదిక్ , విజ్ఞాన్  ఒకేషనల్ కళాశాల ప్రిన్సిపాల్ చుక్క ఆంజనేయులు, ఎస్ఆర్ బీఈడీ కళాశాల ఇన్చార్జ్ కర్ణాకర్ మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు.ఈ సందర్భంగా కే.రవీందర్ దుబ్బాక మండల ట్రెస్మా మండల అధ్యక్షులు  మాట్లాడుతూ ఈ అవార్డ్ తో తనపై మరింత  బాధ్యతలు పెరిగాయన్నారు. విద్యారంగoలో మరిన్ని ఉత్తమమైన సేవలను అందించడానికి కృషి చేస్తానన్నారు.తనను వెన్నుతట్టి ప్రోత్సహించిన స్నేహితులకు, శ్రేయోభిలాషులకు రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలియజేశారు.
Spread the love