నవతెలంగాణ – కంటేశ్వర్
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం మూలంగానే పేదలకు ఇళ్ల స్థలాలు రావడంలేదని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మండిపడ్డారు.నిరుపేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వటంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం చేయటంతో పేదల జీవితాలు మరింత దిగజారిపోతున్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. పేదరికం నివారిస్తామని నిరుపేదలకు పక్కా ఇండ్లను నిర్మించి ఇస్తామని కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ నెరవేర్చలేదని పైగా నిత్యవసర సరుకుల ధరలను అడ్డు అదుపు లేకుండా పెంచడంతో పేదల బతుకులు మరింత దిగజారుతున్నాయని ఉపాధి అవకాశాలు లభించక అర్థాకళితో జీవిస్తున్నారని ఇబ్బందులను భరించలేక అనేకమార్లు అధికారుల చుట్టూ నాయకుల చుట్టూ డబల్ బెడ్ రూమ్ ఇండ్ల కొరకు నిర్మాణం కొరకు ఏంటి స్థలాల మంజూరు కొరకు అర్జీలు పెట్టుకున్న మొరపెట్టుకున్న స్పందించకపోవడంతో లేక ప్రభుత్వ స్థలాల్లో పేదలు గుడిసెలు వేసుకొని పోరాటం చేయటం జరుగుతుందని ఆయన అన్నారు. ఐక్య పోరాటాల ద్వారానే ప్రజా సమస్యల పరిష్కారమవుతాయని రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పి మూడు ఎకరాల భూమి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చినప్పటికీ వాటిని నెరవేర్చకపోవటం ప్రజల పట్ల ప్రభుత్వాలకు ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతుందని ఆయన విమర్శించారు ఇండ్ల స్థలాలు వచ్చేవరకు ప్రజలందరూ ఐక్యంగా కుల మ తాలకు అతీతంగా పోరాడాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గోవర్ధన్, నగర నాయకులు సుజాత బే రంగుల కృష్ణ, నల్వాల నరసయ్య, కటారి రాములు, కళావతి ఇతరులు పాల్గొన్నారు.