విద్యుత్‌ సమస్యతో రైతులకు తప్పని ఇబ్బందులు

– పంట పొలాలు ఎండిపోతున్నాయంటూ ఆందోళన
– పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ-కోదాడరూరల్‌
మండలపరిధిలోని రామలక్ష్మీపురం గ్రామంలో రైతులు విద్యుత్‌ సమస్యతో అనేక ఇబ్బందులు పడుతున్నారు.గ్రామంలో రైతులు బోర్లు బావుల కింద వరి పంట వేశారు.విద్యుత్‌ సమస్యతో విద్యుత్‌ లేక పంటలు ఎండిపోతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.విద్యుత్‌ 24 గంటలు ఇస్తేనే బోరు పోస్తేనే నీరు సరిపోతుందని రైతులు పేర్కొంటున్నారు.ఒకరోజులో రెండు గంటలు ఇస్తున్నారని మరలా విద్యుత్‌ ఆఫ్‌ అవుతుందని..అసలు ఎప్పుడు సరఫరా చేస్తున్నారో..చేయడం లేదో..తెలియని పరిస్థితి నెలకొన్నదని వాపోతున్నారు.ఈవిషయమై లైన్‌మెన్‌కు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో గ్రామంలో వరి పంట ఎండిపోతుందని పేర్కొంటున్నారు.వర్షాలు లేక ఎడమ కాల్వ కింద సాగు చేసిన పంటలు దాదాపుగా ఎండిపోతున్నాయని బోర్లు, బావుల కింద వేసిన పంటలు అయినా కాపాడుకుందామంటే విద్యుత్‌ సమస్యతో అవి కూడా చేతికి పంట అందే పరిస్థితి లేదని తెలుపుతున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి యుద్ధప్రతిపాదికన అధికలోడ్‌ ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లను మార్చి వేసి రైతుల వరిపొలాలను కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.
రెండ్రోజుల్లో విద్యుత్‌ సమస్యను పరిష్కరిస్తా
విద్యుత్‌ ఏఈ- శ్రీనివాస్‌
రైతులు పడుతున్న సమస్య నా దష్టికి వచ్చింది. రైతులు గతంలో కన్నా ఎక్కువ మోటార్లను ఉపయోగిస్తున్నారు. దీంతో విద్యుత్‌ వినియోగం పెరిగి అధిక లోడ్‌ పడడంతో ట్రాన్స్‌ఫార్మర్లను మార్చాల్సి ఉంది.దీనికి ఖర్చవుతుంది.రెండు రోజుల్లో సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తా.

Spread the love