దశాబ్దిఉత్సవాల్లో గుడిసెల జాడేది ?

– బి వెంకట్ అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి
నవతెలంగాణ-గోవిందరావుపేట
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో గుడిసెలు ఇల్లు ఇళ్ల స్థలాల జాడేదని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి వెంకట్ ప్రశ్నించారు. ఇండ్లు ఇళ్ల స్థలాలు డబుల్ బెడ్ రూమ్ గృహాల సాధనకై ఐక్య పోరాటాల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బస్సు యాత్ర మంగళవారం మండలంలోని పసర గుడిసె వాసుల ప్రాంతానికి చేరుకుంది. ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు పొదిళ్ల చిట్టిబాబు సభా అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా వెంకట్ హాజరై మాట్లాడుతూ కోట్ల రూపాయలు వెచ్చించి 20 రోజులుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రోజుకు ఒక ఉత్సవం పేరుతో నిర్వహిస్తుందని అన్నారు. ఈ ప్రభుత్వానికి డబుల్ బెడ్ రూమ్ గృహాలు గుడిసె వాసులు చేస్తున్న పోరాటాలు ప్రధానంగా మహిళలు చాటు కోసం వేస్తున్న గుడిసెల కష్టాలు ప్రభుత్వానికి కనబడలేదా అని ప్రశ్నించారు. వాస్తు దోషాల పేరుతో కోట్లాది రూపాయల విలువచేసే కట్టడాలను కూలగొట్టించి నూతన భవనాలు నిర్మిస్తున్న ప్రభుత్వానికి పేదల కష్టసుఖాలు పట్టవా అన్నారు. కేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలను నిర్వహిస్తున్నామని దీనిలో ఇళ్ల పోరాటాల కోసం కూడా ఢిల్లీ స్థాయిలో ఉద్యమిస్తామని అన్నారు. ఐక్యరాజ్యసమితి దేశాలలో ఒకటైన మన భారతదేశం నివసించే ప్రతి వాడికి ఇల్లును నిర్మిస్తామని పేర్కొందని కానీ ఇప్పటివరకు అమలు పరచలేదని అన్నారు. ఇల్లు ఇళ్ల స్థలాలు ప్రధాన సమస్యగా పోరాటం కొనసాగుతుంది. ఎస్ వీరయ్య బస్సు యాత్ర కన్వీనర్ సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు. ఇల్లు ఇళ్ల స్థలాల ప్రధాన సమస్యలు జరుగుతున్న పోరాటాలు వీటివృత్తంగానే ఈ బస్సు యాత్ర కొనసాగుతోందని బస్సు యాత్ర కన్వీనర్ ఎస్ వీరయ్య అన్నారు. ఈనెల 18న మొదలైన ఈ యాత్ర 27న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం బహిరంగ సభతో ముగుస్తుందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో 61 ప్రాంతాల్లో గుడిసె వాసుల పోరాట కేంద్రాల కొరకు విస్తృతంగా యాత్ర నిర్వహిస్తున్నామని అన్నారు. బృందా కారత్ ప్రారంభించిన ఈ యాత్ర ముగింపు సందర్భంగా బివి రాఘవులు ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారని అన్నారు. డబుల్ బెడ్ రూమ్ గృహాలు ఇస్తానన్న రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన వాటిని పంపిణీ చేయలేక సతమతమవుతుందని కొన్నిచోట్ల లబ్ధిదారులే అసంపూర్తి నిర్మాణాల్లో స్వతంత్రంగా నివాసం ఉంటున్నారని అన్నారు. మరికొన్నిచోట్ల కట్టిన గృహాలు శిథిలావస్థకు చేరుతున్న పంపిణీకి నోచుకోవడం లేదని అన్నారు. ఇలాంటి స్థితిల్లో ఇచ్చిన వాగ్దానాన్ని ఎలా అమలు చేస్తారో అర్థం కావడం లేదని అందుకే గుడిసె పోరాటాలను ప్రారంభించామని ఈ పోరాటంలో దిగ్విజయంగా ముందుకు సాగుతున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ దశాబ్ది ఉత్సవాల్లో ఇళ్ల ఉత్సవాల ప్రస్తావన లేకపోవడం పేదవారి గృహాలపై ప్రభుత్వానికి ఉన్న సవతి ప్రేమ తెలుస్తుందని అన్నారు. ఈ ప్రభుత్వానికి గుడిసెలపై పోరాటం విలువ తెలిసే వరకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని అన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా బెదిరింపులు అయిన తట్టుకొని ముందుకు సాగుదామని అన్నారు. అభివృద్ధి అంటే పట్టణాలు కాదని పల్లెలో కూడా అభివృద్ధి కనిపించాలని అన్నారు. పల్లెల్లో కూడా ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ప్రభుత్వం ఈ విషయాన్ని విస్మరించి ఉత్సవాల పేరుతో ప్రజలను పక్కదోవ పట్టిస్తూ కాలయాపన చేస్తుందని అన్నారు. సిపిఐ ఎం రాష్ట్ర కమిటీ సభ్యులు సూది కృష్ణారెడ్డి మాట్లాడుతూ లక్షలాది విలువైన భూములు అన్యాక్రాంతం కాకుండా పేద ప్రజానీకానికి ఉపయోగపడే విధంగా ప్రజా పోరాటాలు నిర్వహిస్తున్నామని అన్నారు అందుకు తగ్గట్టుగా ప్రజలు కూడ సకాలంలో స్పందించి ఆలస్యం కాకుండా నిర్మాణాలను పూర్తి చేసుకొని ఇతరులకు ఆస్కారం ఇవ్వకుండా సహకరించాలని అప్పుడే పూర్తిస్థాయిలో మన పోరాటం విజయవంతం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ రాష్ట్ర కార్యదర్శి టీ స్కైలాబ్ బాబు రజక సంఘం రాష్ట్ర కార్యదర్శి పైల్ల ఆశయ సోషల్ మీడియా ఇన్ఛార్జి జగదీష్ డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్ ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు వేముల ఆనంద్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి నాగరాజు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి బి రెడ్డి సాంబశివ డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు బి సంజీవ గొర్ల కాపరుల సంఘం మండల నాయకులు కడారి నాగరాజు వ్యవసాయ కార్మిక సంఘం సీనియర్ నాయకులు అంబాల పోషకాలు ఐద్వా నాయకురాలు కవిత గుడిసె వాసుల పోరాట కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న బైక్ ర్యాలీ
ఇల్లు ఇళ్ల స్థలాలు గుడిస వాసుల పోరాటాలు ప్రధాన సమస్యగా ప్రారంభమైన బస్సు యాత్ర మండలానికి చేరుకోగానే మండలంలోని వందకు మందిగా డివైఎఫ్ఐ యువకులు బైకులతో భారీ ర్యాలీ నిర్వహించారు. రెడ్ టీ షర్ట్లు ధరించి ఎర్రజెండాలు కట్టిన బైకులతో ర్యాలీ 163 వ జాతీయ రహదారి పొడుగునా ఆసక్తికరంగా సాగింది.

Spread the love