నవతెలంగాణ – హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో రాష్ట్రంలో నగదు, మద్యం భారీగా పట్టుబడుతోంది. నిన్న రాత్రి వరకు వాహనాల తనిఖీల్లో రూ.74.95 కోట్ల విలువ చేసే నగదు, మద్యం, డ్రగ్స్, ఇతర సామాగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో 148 చెకోపోస్టులు ఏర్పాటు చేసి ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. పట్టుబడిన వాటిలో రూ.48.32 కోట్ల నగదు ఉండటం గమనార్హం.