శివ రాజ్‌కుమార్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న చిత్రం ‘ఘోస్ట్’. శ్రీని దీనికి దర్శకుడు. సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సందేశ్ నాగరాజ్ నిర్మించిన ఈ చిత్రం ఈనెల 19న దసరా కానుకగా కన్నడ, తెలుగు, తమిళ, హిందీ, మలయాళం భాషల్లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈనెల 1న చిత్ర బృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి తెలుగు ట్రైలర్‌ను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేయటం విశేషం. అద్భుతమైన యాక్షన్ ఫీస్ట్‌తో ఈ సినిమా ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుందని ట్రైలర్ చెప్పకనే చెప్పింది. శివరాజ్ కుమార్ స్క్రీన్ ప్రెజెన్స్‌కి దర్శకుడు శ్రీని తనదైన విజన్‌తో హీరోయిజాన్ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళడం హైలెట్‌గా నిలిచింది.