ఢిల్లీలో దుమ్ము తుఫాను…

నవతెలంగాణ – హైదరాబాద్: ప్రపంచంలోని కాలుష్య నగరాల్లో టాప్ స్థానంలో ఉన్న దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం సాయంత్ర దుమ్ము తుఫాన్ వచ్చింది. సాయంత్రం 6 గంటలకు ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో దుమ్ము తుఫాను కారణంగా ఢిల్లీలో జనజీవనం అస్తవ్యస్తమైంది. రోడ్లు కూడా సరిగా కనిపించకుండా దుమ్ము తుఫాన్ ప్రజలను ఇబ్బందులకు గురిచేసింది. ముఖ్యంగా బాగా మాత్రం ముందు ఏమీ కనిపించక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం ఢిల్లీలో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసిన సంగతి తెలిసిందే. వేడీ తీవ్రతతో బాధపడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగించే అవకాశం ఉంది. ఢిల్లీలో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, మధ్యాహ్నం, సాయంత్రం కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం లేదా చినుకులు పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. కొన్ని ప్రాంతాల్లో గంటకు 35 కిలోమీటర్ల వేగంతో వేడిగాలులు, బలమైన గాలులు వీస్తాయని పేర్కొంది.

Spread the love