మండలంలోని కవ్వాల్లలో అడవిలో బుధవారం నెదర్లాండ్ దేశస్తులు పర్యటించారు. మంగళవారం రాత్రిలో మండల కేంద్రంలోని హరిత రిసార్ట్ లోబస చేసినట్లు హరితరిసార్ట్ మేనేజర్ వీరేందర్ తెలిపారు. బుధవారం మల్యాల, అలినగర్, గిరిజన గ్రామాలను సందర్శించారు. అడవి జంతువుల, వృక్ష సంపదపై అటవీ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గురువారం ఆసిఫాబాద్ జిల్లా నార్నూర్ గిరిజన గ్రామాల్లో పర్యటించనున్నట్లు తెలిపారు.