ఒత్తిళ్లకు గురికాకుండా విధులు నిర్వహించాలి

– జిల్లా ఎన్నికల అధికారి సి. నారాయణ రెడ్డి
నవతెలంగాణ-వికారాబాద్‌ ప్రతినిధి
ఎలాంటి ఒత్తిడికి లోనూ కాకుండా ప్రశాంతంగా కౌంటింగ్‌ విధులు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి సి. నారాయణ రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో కౌంటింగ్‌ సూపర్వైజర్లు, కౌంటింగ్‌ అసిస్టెంట్లకు వారి విధులపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికలలో ముఖ్యమైన ఘట్టం కౌంటింగ్‌ అన్నారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా కౌంటింగ్‌ వీధులు నిర్వహించాలని సూచించారు. కౌంటింగ్‌కు కేటాయించిన సిబ్బంది అందరూ పూర్తి అవగాహనతో పాటు సమయస్ఫూర్తి కలిగి ఉండా లన్నారు. కౌంటింగ్‌లో భాగంగా ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌ను లెక్కించాలన్నారు. ఎన్నికల పరిశీలకుల ఆధ్వర్యంలో ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారని తెలిపారు. కౌంటింగ్‌ కేంద్రాన్ని పరిగి మండల కేంద్రంలోని మార్కెట్‌ యార్డులో ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు సంబంధిం చిన కౌంటింగ్‌ కేంద్రాలను అక్కడే ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఓట్ల లెక్కింపులో భాగంగా సిబ్బంది అం దరికీ ఓటింగ్‌ యంత్రాలపై పూర్తి అవగాహన ఉండా లన్నారు. రాండమైజేషన్‌ తర్వాత కౌంటింగ్‌ సెంటర్ల ను కేటాయిస్తామన్నారు. కేటాయించిన కౌంటింగ్‌ సెంటర్‌కు సిబ్బంది అందరూ సకాలంలో హాజరుకా వాలని, దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఒకరోజు ముందుగానే చేరుకోవాలని సూచించారు. కార్య క్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి చక్రపాణి, డీపీఓ తరుణ్‌కుమార్‌, భూగర్భ జల వనరుల శాఖ అధికారిని దీపారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Spread the love