ఏపీ కొత్త‌ డీజీపీగా ద్వార‌కా తిరుమ‌ల‌రావు

నవతెలంగాణ – హైదరాబాద్: ఏపీ కొత్త‌ డీజీపీగా ద్వారకా తిరుమలరావు నియమితులయ్యారు. ప్రస్తుతం ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా విధులు నిర్వహిస్తున్న ద్వారకా తిరుమలరావును డీజీపీగా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి (సీఎస్) నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపారు.

Spread the love