మునుగోడు గడ్డపై 40వేల మెజార్టీతో ఎగిరిన కాంగ్రెస్ జెండా ..

– ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 స్థానాలకు 11 స్థానాలు గెలిచిన కాంగ్రెస్
– గ్రామ గ్రామాన  కాంగ్రెస్ శ్రేణుల విజయోత్సవ సంబరాలు
నవతెలంగాణ- మునుగోడు: మునుగోడు నియోజకవర్గం లో నవంబర్ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ఆదివారం ఎన్నికల ఫలితాలు వెల్లడించడంతో మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 40 వేల పైచింది గల మెజార్టీతో మునుగోడు గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేయడంతో నియోజకవర్గంలోని కాంగ్రెస్ శ్రేణులు అభిమానులు యువజన కాంగ్రెస్ నాయకులు గ్రామ గ్రామాన టపాకాయలు కాల్చి సీట్లు పంపిణీ చేసి విజయోత్సవ సంబరాలను మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో పదవులను  సైతం లెక్కచేయకుండా సాధించుకున్న తెలంగాణలో  గత పది సంవత్సరాలుగా పాలన కొనసాగిస్తున్న కెసిఆర్ కు గుణపాఠం చెప్పే విధంగా జిల్లాలో 12 స్థానాలకు 11 స్థానాలను గెలిచి మరోసారి నల్లగొండ గడ్డ కాంగ్రెస్ అడ్డా అనే విధంగా తీర్పు  ఇచ్చిన ఉమ్మడి నల్లగొండ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసి నల్లగొండ గడ్డ రుణం తీర్చుకుంటుందని కాంగ్రెస్ నాయకులు విజయోత్సవ సంబరాల సందర్భంగా తెలుపుతున్నారు.
Spread the love