నవతెలంగాణ – మాక్లూర్
మండలంలోని బిజెపి నాయకులను, కార్యకర్తలను ముందస్తు అరెస్టుల పేరుతో అర్థ రాత్రి పట్టుకావచి పోలీసు స్టేషన్ లో సోమవారం అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా అరెస్ట్ అయిన నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను మర్చిపోయినందున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడికి భారతీయ జనతా పార్టీ తలపెట్టిన కార్యక్రమానికి వెళ్లకుండా బిజెపి నాయకులను ముందస్తు ఆరెస్ట్ పోలిసులు చేశారు. అరెస్టుల చేయడం సరైంది కాదని అన్నారు. బిజెపి జిల్లా కార్యదర్శి సంతోష్, మండల అధ్యక్షులు సురేష్, శ్రీకాంత్, రవి యాదవ్, గంగాధర్, రవి గౌడ్, రాజశేఖర్, రాజేశ్వర్,తదితరులు అరెస్ట్ అయ్యారు.