మండల కేంద్రంలోని కొంతమంది మున్నూరు కాపులు హైదరాబాద్ లోని ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం నందువల్ల పోలీసులు వారిని ముందస్తు అరెస్టు చేశారు.ఈసందర్భంగా మండల అధ్యక్షుడు కల్లూరి నరహరి మాట్లాడుతూ రాజకీయంగా పెద్దపీట వేసి తమ డిమాండ్లు నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మున్నూరు కాపు ఆత్మగౌరవ మహా ధర్నా వెళ్తున్నామని పోలీసులు ముందస్తు అరెస్టు చేయడం దయనీయకరమని అన్నారు.అదేవిధంగాసంవత్సరానికి 5000 కోట్లతో మున్నూరుకాపు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి అని డిమాండ్ చేశారు. మున్నూరుకాపు విద్యార్థి వసతి గృహాన్ని ఎండోన్మెంట్ బోర్డు నుండి తొలగించి మున్నూరు కాపులకు అప్పగించాలి అన్నారు.మున్నూరుకాపు ప్రతి కుటుంబానికి కుల వృత్తుల సహాయం కింద రూ.5 లక్షలు కేటాయించాలన్నారు.మున్నూరుకాపులకు ప్రత్యేక10శాతంరిజర్వేషన్ అమలు చేయాలని, లేదా బీసీడీకి23శాతంరిజర్వేషన్ కలిపించాలిఅనిడిమాండ్ చేశారు.మున్నూరుకాపు పండించిన పంటకే బీమాను అందించి ప్రకృతి నుండి దళారులనుండి రైతులను ఆదుకోవాలన్నారు.మున్నూరుకాపుల పై చదువులకు స్కాలర్షిప్ ప్రకటించాలి అనిడిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ మున్నూరు కాపు అధ్యక్షులు సాతల్లి పండరి, రావుల సాయిలు,తైదల్ పండరి,సాయిలు, కరోబార్ పండరి,రామచందర్,తదితర మున్నూరు కాపులు పాల్గొన్నారు.
ముందస్తు అరెస్టులు సిగ్గుచేటు..
– మున్నూరు కాపులను అరెస్టు చేసిన పోలీసులు
నవతెలంగాణ-పెద్దకొడప్ గల్