నవతెలంగాణ-హైదరాబాద్ : రాష్ట్రంలో రేపటి నుండి ఒంటి పూట బడులు మొదలు కానున్నాయి. ప్రభుత్వం చేయనున్న కులగణన సర్వేలో ప్రభుత్వ ప్రాథమిక స్కూళ్ల టీచర్లను వినియోగించుకోనుంది. ఈ నేపథ్యంలోనే ప్రైమరీ స్కూల్స్ ఉ.9గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పని చేస్తాయి. సర్వే పూర్తయ్యే వరకు ఈ ఒంటి పూట బడులు కొనసాగనున్నాయి. అటు ఈ సర్వేను ఈ నెల 30 వరకు పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.