మండలంలోని కలమడుగు గ్రామంలో ఉన్న వివేకానంద ప్రైవేట్ పాఠశాలలో ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో పాఠశాలలో రాఖీ పండుగ జరుపుకున్నారు. బాలికలు బాలురకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మండలంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో కళాశాలలో ముందస్తు రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధర్మ జాగరణ సమితి సభ్యులు శ్రీనివాస్, ప్రిన్సిపాల్ సతీశ్ గౌడ్, ఇంచార్జీ తిరుపతి వివిధ పాఠశాలల ప్రిన్సిపాల్ లు ఉపాధ్యాయులు పాల్గొన్నారు