రామగిరి మండలంలోని ప్రగతి హైస్కూల్ పాఠశాలలో ముందస్తు ముగ్గుల పోటీలను శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్బంగా విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. రంగు రంగుల రంగవల్లులతో, మామిడి తోరణాలతో పాఠశాల ఆవరణ శోభయమానంగా మారింది. ఈ సందర్బంగా నిర్వహించిన ముగ్గుల పోటీ గురించి పాఠశాల కరస్పాండెంట్ అబ్బు కేశవరెడ్డి మాట్లాడుతూ.. మన పండుగల ఆవశ్యకత, గొప్పతనం తెలుసుకునేందుకు ఈ ముగ్గుల పోటి ఎంతగానో ఉపయోగ పడుతుందని, గెలుపొందిన విద్యార్థులకు ప్రత్యేక బహుమతులు అందిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి రాము, ఉపాధ్యాయులు రవీందర్, కృష్ణమూర్తి, సత్యనారాయణ, ఇందిర, రజిత, అనిషా, జ్యోతి, కోమలత, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.