నవతెలంగాణ – అమెరికా: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో భూకంపం వచ్చింది. మంగళవారం రాత్రి లాస్ ఏంజిల్స్‌కు వాయవ్య దిశలో భూకంపం సంభవించింది. ఎటువంటి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. అమెరికా జియోలాజికల్ సర్వే దీనిపై ప్రకటన చేసింది. రిక్టర్ స్కేల్‌పై 5.2 తీవ్రతతో భూమి కంపించినట్లు తెలిపింది. రాత్రి 9 గంటల 9 నిమిషాలకు భూమి కంపించింది. కెర్న్ కౌంటీలోని మెట్లర్ వద్ద భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు చెప్పారు. లాస్ ఏంజిల్స్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో ఏమైనా నష్టం జరిగిందా లేదా అన్న కోణంలో చెక్ చేస్తున్నారు. లాస్ ఏంజిల్స్ డాజర్స్, ఫిలడెల్ఫియా ఫిల్లీస్ జట్ల మధ్య బేస్‌బాల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో స్టేడియంలో భూ ప్రకంపనలు నమోదు అయ్యాయి. కానీ ప్రేక్షకులు మాత్రం చలించలేదు. భూకంప ప్రాంతంలో తనిఖీ చేపట్టనున్నట్లు కెర్న్ కౌంటీ ఫైర్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది.