జపాన్‌లో భూకంపం..

నవతెలంగాణ – టోక్యో: జపాన్‌లోని ఇషికావా ప్రిఫెక్చర్‌లో నిమిషాల వ్యవధిలో రెండుసార్లు భూమి కంపించింది. సోమవారం తెల్లవారుజామున 6.31 గంటలకు 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. అదే ప్రాంతంలో మరో 10 నిమిషాల తర్వాత 4.8 తీవ్రతతో భూమి కంపించింది. దీంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. నోటో పీఠభూమిలో భూకంప కేంద్రం ఉన్నదని జపాన్‌ వాతావరణ శాఖ తెలిపింది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని పేర్కొంది. నోటో నగరంలో ఐదు కంటే తక్కువ తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని తెలిపింది. ప్రస్తుతం ఎలాంటి సునామీ ముప్పు లేదని అధికారులు వెల్లడించారు. ఇదే ప్రాంతంలో జనవరి 1న సంభవించిన భూకంపంలో 230 మందికిపైగా మరణించిన విషయం తెలిసిందే.

Spread the love