నవతెలంగాణ-మణుగూరు/ వరంగల్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు, వరంగల్‌లో శుక్రవారం తెల్లవారుజామున స్వల్పంగా భూమి కంపించింది. మణుగూరు మున్సిపాలిటీలో తెల్లవారుజామున 4 గంటల 43 నిమిషాలకు ఐదు సెకండ్లు భూమి కంపించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్సీఆర్) ప్రకారం.. భూకంప తీవ్రత రెక్టర్ స్కేల్‌పై 3.6గా నమోదైనట్టు అధికారులు తెలిపారు. భూ అంతర్భాగంలో 30 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని వెల్లడించారు. రాజుపేట, విఠల్‌రావు నగర్, బాపనగుంట, శివలింగాపురం గ్రామాల్లో ఇండ్లలో వస్తువులు కదలడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. మండల పరిధిలో సమితి సింగారం, అశోక్‌నగర్, ముత్యాలమ్మ నగర్, పగిడేరులో కూడా భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. మణుగూరులో భూకంపం రావడం ఇది రెండోసారి.వరంగల్లోనూ స్వల్పంగా భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదైనట్టు జాతీయ భూకంప అధ్యయన విభాగం వెల్లడించింది.