వరంగల్‌లో భూకంపం…

నవతెలంగాణ – వరంగల్‌: వరంగల్‌లో స్వల్ప భూకంపం వచ్చింది. శుక్రవారం తెల్లవారుజామున 4.43 గంటలకు వరంగల్‌లో భమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 3.6గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది. భూ అంతర్భాగంలో 30 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని వెల్లడించింది. కాగా, తెల్లవారుజామున భూమి కంపించడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించి ఎలాంటి సమాచారం అందలేదని అధికారులు వెల్లడించారు.

Spread the love