లడఖ్ లో కంపించిన భూమి

earthquakeనవతెలంగాణ – హైదారాబాద్ : కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్‌ లో భూకంపం సంభవించింది. కార్గిల్ జిల్లాలో సోమవారం రాత్రి భూమి కంపించినట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ వెల్లడించింది. భూకంపం తీవ్రత రిక్టరు స్కేలుపై 5.2గా నమోదైనట్లు తెలిపింది. కార్గిల్‌కు వాయువ్యంగా 148 కిలోమీటర్ల దూరంలో, భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు పేర్కొంది. ఈ భూకంపం ధాటికి ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ప్రకంపనలు స్వల్ప స్థాయిలోనే ఉండటంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని స్థానిక అధికారులు తెలిపారు.

Spread the love