PhonePe గేట్ వే ద్వారా రూ.8 లక్షల వరకు ఆదా చేసుకునే సౌలభ్యం

– ఈ పరిమిత కాల ఆఫర్ మర్చంట్లకు ఆన్ బోర్డింగ్ ఖర్చులను ఆదా చేయడంతో పాటు దానిని తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునేలా సహాయపడుతుంది.
నవతెలంగాణ – ఢీల్లి : తమ పేమెంట్ గేట్ వే చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలకు రూ.8 లక్షల వరకు ఆదా చేసుకునే వీలు కల్పిస్తోందని PhonePe నేడు ప్రకటించింది. చాలావరకు పేమెంట్ గేట్ వేలు 2%ను ప్రామాణిక లావాదేవీ ఫీజుగా వసూలు చేస్తుండగా, PhonePe పేమెంట్ గేట్ వే మాత్రం కొత్త మర్చంట్లకు ఆన్ బోర్డింగ్ ను ఉచితంగా కల్పించే ఒక ప్రత్యేక ఆఫర్ కలిగి ఉంది. ఇందులో ఎలాంటి రహస్య ఛార్జీలు, సెటప్ ఫీజు లేదా వార్షిక నిర్వహణ ఫీజులు ఉండవు. ఉదాహరణకు, నెలకు రూ. 1 కోటి సేల్స్ పరిమాణం కలిగిన వ్యాపార సంస్థలు PhonePe పేమెంట్ గేట్ వే ను ఉచితంగా అందుకునే పక్షంలో, వారు నెలకు రూ. 2లక్షల వరకు ఆదా చేసే అవకాశాలు ఎక్కువగా ఉండొచ్చు. PhonePe పేమెంట్ గేట్ వే అందిస్తున్న ఈ పరిమిత కాల ఆఫర్ తో , భారతదేశ వ్యాప్తంగా తమ వేదికలో చేరుతున్న వ్యాపార సంస్థలు రూ. 8లక్షల వరకు ఆదా చేయొచ్చు. ఈ సూటి అయిన, పారదర్శకమైన ధర మర్చంట్లకు తమ పేమెంట్ అనుభవాన్ని నిరంతరాయంగా చేసుకునే అవకాశాన్ని విస్తరించడంతో పాటు ఆన్ బోర్డింగ్ ఖర్చులలో లభించిన ఆదాను తమ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడంలో పెట్టుబడి పెట్టేందుకు వారిని అనుమతిస్తుంది. UPI మార్కెట్ లో ఇప్పటికే PhonePe 50% పైగా మార్కెట్ వాటాతో మార్కెట్ లీడర్ గా నిలుస్తోంది. భారీ స్థాయి లావాదేవీలను నిర్వహించగల సంస్థ సామర్థ్యం, ఈ వేదికపై వినియోగదారులకున్న బలమైన నమ్మకం వినియోగదారులకు, మర్చంట్లు లాంటి వారికి అత్యున్నత స్థాయి పేమెంట్ అనుభవాన్ని అందించేందుకు తన పేమెంట్ గేట్ వే వ్యాపారాన్ని PhonePe ఆవిష్కరించేలా చేసింది. మర్చంట్ అనుభవాన్ని మెరుగుపరచడం కోసం తేలికైన వినియోగం, పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేని సమగ్రత, డిజిటల్ సెల్ఫ్ ఆన్ బోర్డింగ్, వినియోగదారులకోసం అవాంతరాలు లేని చెక్ అవుట్ అనుభవం లాంటివి దేశవ్యాప్తంగా ఉన్న మర్చంట్లు మరియు మధ్య, చిన్న తరహా పరిశ్రమలు (MSME) PhonePe పేమెంట్ గేట్ వే ను ఇష్టమైన ఎంపికగా చేసింది. PhonePe పేమెంట్ గేట్ వే నమ్మకమైనది మాత్రమే కాక మర్చంట్లకు 100% సకాల నిర్వహణకు భరోసా ఇస్తోంది. వ్యాపార రంగంలో అత్యుత్తమ విజయవంతమైన రేట్లను కలిగి ఉంది. పరికరం యొక్క పనితీరు సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు గుర్తిస్తూ, లావాదేవీలు నిలకడగా విజయవంతమయ్యేలా చూస్తుంది. అంతరాయం లేకపోవడం, అన్ని వేదికల్లోనూ స్వయంచాలకంగా కలిసేందుకు ఎలాంటి కోడ్ సెటప్ అవసరం లేనందున PhonePe పేమెంట్ గేట్ వేను మర్చంట్లు కూడా ఇష్టపడుతున్నారు. ఆండ్రాయిడ్, iOS, మొబైల్ వెబ్ మరియు డెస్క్ టాప్ లోని ఆన్ లైన్ పేమెంట్లను అంగీకరించడానికి ఇప్పటికే PhonePe తన మర్చంట్ భాగస్వాముల వ్యాపారాలకు కూడా సహాయపడుతుంది. PhonePe పేమెంట్ గేట్ వే యొక్క వాస్తవ సామర్థ్యం గురించి FlowerAura & Bakingo సంస్థ వ్యవస్థాపకులు సుమన్ పాత్రా మాట్లాడుతూ, “ఒక ఇ-కామర్స్ సంస్థగా, నమ్మకమైన గేట్ వే భాగస్వామిని కలిగి ఉండడం చాలా ముఖ్యం. అంతేకాక, PhonePe యొక్క వారసత్వం, అనుభవం వల్ల PhonePe పేమెంట్ గేట్ వే ను మా అభివృద్ధి భాగస్వామిగా కలిగి ఉండడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడం, ట్రాక్ ఆఫ్ లను తగ్గించడం మరియు మొత్త పేమెంట్ విజయ నిష్పత్తిని పెంచడానికి అది మాకు సహాయపడింది. వారి నిరంతరాయ ఆన్ బోర్డింగ్ ప్రక్రియ మరియు అత్యుత్తమ మర్చంట్ మద్ధతు లాంటివి PhonePeతో కలసి తమ కార్యకలాపాలను కొనసాగించడానికి ముఖ్య కారణాలుగా నిలుస్తున్నాయి.” అని అన్నారు. PhonePe పేమెంట్ గేట్ వే యొక్క అత్యుత్తమ స్థాయి పేమెంట్ అనుభవం గురించి Jar కో ఫౌండర్ & CEO నిశ్చయ్ AG మాట్లాడుతూ, “Jarలో మేము ప్రయాణం ప్రారంభించినప్పుడే, PhonePeకు జనంలో ఉన్న ఆదరణ మరియు స్పందన ఆధారంగా PhonePeను మా పేమెంట్ భాగస్వామిగా చేసుకున్నాము. వినియోగదారులు ఇప్పటికే UPIకు సిద్ధంగా ఉండడంతో PhonePe యొక్క భారీ నెట్ వర్క్ మా పనిని చాలా సులభతరం చేసింది. PhonePeలోని పేమెంట్ గేట్ వే బృందం మాతో మొదటి నుండి చక్కటి సహకారం అందిస్తోంది. పూర్తి వ్యవస్థను నిరంతరం మెరుగుపరిచే దిశగా అది కృషి చేస్తోంది. అది మాకు మెరుగైన విజయవంతమైన రేట్లు ఇస్తున్నాయి. ”వినియోగదారుల అంగీకారాన్ని తీసుకున్న తర్వాత PhonePe కార్డ్ వాల్ట్ లో కస్టమర్ల టోకనైజ్ చేసిన కార్డులను సురక్షితంగా నిల్వ చేసేందుకు PhonePe పేమెంట్ గేట్ వే RBI చట్టాలకు అనుగుణంగా ఉంది.
PhonePe పరిచయం:
డిసెంబర్ 2015లో స్థాపితమైన PhonePe, అటు యూజర్‌లకు, ఇటు వ్యాపారులకు డిజిటల్ సదుపాయాలను అందించి తక్కువ సమయంలోనే భారతదేశపు అతిపెద్ద పేమెంట్ యాప్‌గా ఎదిగింది. ఇందులో 46+ కోట్ల (460+ మిలియన్ల) మంది యూజర్‌లు ఇప్పటిదాకా రిజిస్టర్ చేసుకున్నారు. ప్రతి నలుగురు భారతీయుల్లో ఒకరు PhonePeని వాడుతున్నారు. ఈ కంపెనీ, 3.5 కోట్ల (35 మిలియన్ల) మంది ఆఫ్‌లైన్ వ్యాపారులను విజయవంతంగా డిజిటైజ్ చేసింది. వీరంతా టియర్ 2, 3, 4 ప్రాంతాలతో పాటు వాటి ఆవల కూడా ఉన్నారు. తద్వారా ఈ యాప్, దేశంలోని 99% పిన్‌కోడ్‌లను కవర్ చేస్తోంది. భారత్ బిల్ పే సిస్టమ్ (BBPS)లో కూడా PhonePe అగ్రగామిగా నిలిచి BBPS ప్లాట్‌ఫామ్‌లో 45% లావాదేవీలను ప్రాసెస్ చేస్తోంది. PhonePe 2017లో ఆర్థిక సేవల రంగంలోకి ప్రవేశించి, తన ప్లాట్‌ఫామ్‌లో యూజర్‌లు సురక్షితంగా, వారి వీలును బట్టి పెట్టుబడి పెట్టే అవకాశాలను కల్పిస్తోంది. అప్పటి నుండి, కంపెనీ పలు రకాల మ్యూచువల్ ఫండ్స్‌ను, ఇన్సూరెన్స్ ఉత్పత్తులను ప్రవేశపెట్టింది. ఇవి ప్రతి భారతీయుడికి, డబ్బు ప్రవాహాన్ని అన్‌లాక్ చేయడానికి, సేవలను పొందడంలో సమాన అవకాశాలను కల్పిస్తున్నాయి. ట్రస్ట్ రీసెర్చ్‌ అడ్వయిజరీ (TRA) ప్రకటించిన బ్రాండ్ ట్రస్ట్ రిపోర్ట్ ప్రకారం, వరుసగా రెండు సంవత్సరాల (2022 & 2023) పాటు డిజిటల్ పేమెంట్లలో అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్‌గా PhonePe గుర్తింపు దక్కించుకుంది. అకౌంట్ అగ్రిగేటర్ వ్యాపారం కోసం, PhonePeకు పూర్తిగా సొంతమైన అనుబంధ సంస్థ అయిన PhonePe టెక్నాలజీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (PTSPL) కంపెనీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934లోని సెక్షన్ 45IA ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన 19.01.2023 నాటి చెల్లుబాటు అయ్యే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌ను కలిగి ఉంది. అయితే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కంపెనీ ప్రస్తుత పరిస్థితికి సంబంధించిన ఆర్థిక స్థిరత్వానికి, కంపెనీ చేసిన క్లెయిమ్‌లకు లేదా వెలిబుచ్చిన అభిప్రాయాలకు లేదా కంపెనీ ద్వారా జరిగిన డిపాజిట్లకు/లయబిలిటీ బాధ్యతలను నిర్వర్తించడానికి సంబంధించి ఎటువంటి బాధ్యతా తీసుకోదు లేదా ఎలాంటి గ్యారంటీని ఇవ్వదు.

Spread the love