చియా విత్తనాలు తింటే…

ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.. ఫిబ్రవరిలో వేడి ఇలా ఉంటే మార్చి, ఏప్రిల్‌ వరకు పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇప్పటి నుంచే శరీరాన్ని చల్లగా ఉంచే పదార్థాలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాంటి ఆహారాల్లో ఒకటి చియా విత్తనాలు. ఈ చియా గింజలను జ్యూస్‌లో లేదా తాగే నీటిలో వేస్తే మంచిది. వీటిని రోజూ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం…
ఒక రోజులో 2-3 స్పూన్ల చియా విత్తనాలను ఉపయోగించవచ్చు. ఇందులో కేలరీలు 138గ్రా., ప్రోటీన్‌-4.7 గ్రా., కొవ్వు-8.7 గ్రా., పిండి పదార్థాలు-11.9 గ్రా., ఫైబర్‌-9.8 గ్రా., రోజుకు అవసరమైన కాల్షియంలో 14 శాతం, మెగ్నీషియం, ఫాస్పరస్‌, జింక్‌, విటమిన్‌ బి1, విటమిన్‌ బి3లు కూడా అందుతాయి.
– చియా సీడ్స్‌తో బరువు అదుపులో ఉంటుంది
– యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
– ఇది క్యాన్సర్‌ ప్రమాదాన్ని నివారిస్తుంది.
– శరీరంలోని మలినాలను తొలగిస్తుంది.
– ఫైబర్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉండటం వల్ల షుగర్‌ లెవల్స్‌ అదుపులో ఉంచుకోవచ్చు.
– ఆకలి, దాహాన్ని ఎక్కువగా కలిగించదు. తద్వారా అతిగా తినడం అరికట్టవచ్చు.
– డైట్‌లో ఉన్నప్పుడు మిల్క్‌షేక్‌లో వేసుకుని తాగితే శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి.
– మంచి కొలెస్ట్రాల్‌ పెరుగుతుంది
– చియా విత్తనాల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఉంటాయి. ఇందులో ఫైబర్‌ కూడా దొరుకుతుంది.
– ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
– ఇందులో ఉండే కాల్షియం, ఫాస్పరస్‌, మెగ్నీషియం ఎముకలకు మంచిది.
అయితే ఈ విత్తనాలు రోజూ తీసుకోవడం వల్ల మలబద్ధకం, కడుపుబ్బరం సమస్యలు వస్తాయి. పేగు సమస్యలు వస్తాయి. లో బీపీ ఉన్న వారు ఇవి తీసుకుంటే సమస్యలు వస్తాయి. చియా గింజలు మాత్రమే కాకుండా ఫైబర్‌ అధికంగా ఉండే ఆహారాన్ని తినేటప్పుడు కూడా ఇలాంటి సమస్యలు వస్తాయి. అలెర్జీ సమస్యలున్నవారు ఎక్కువగా తీసుకోకూడదు. ఈ గింజలను కొన్ని ఇతర ఆహార పదార్థాలతో కలపడం వల్ల దుష్ప్రభావాలు కలుగుతాయి. నారింజ, ఆవాలు, మెంతులతోపాటుగా కొన్ని ఇతర పదార్థాలతో కలిపి తినవద్దు.

Spread the love