తిరుపతి పోలీసులకు ఈసీ నోటీసులు..

నవతెలంగాణ – అమరావతి: ఏపీలో ఎన్నికల పోలింగ్ తరువాత జరిగిన అల్లర్లపై తిరుపతి పోలీసు అధికారులకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఈ మేరకు పోలీసులకు నోటీసులు అందజేసిన ఈసీ, ఐటీ ఉద్యోగులపై కేసులు నమోదు చేయడానికి గల కారణాలు చెప్పాలని పేర్కొంది. అయితే పోలింగ్ జరిగిన రోజు రాత్రి చంద్రగిరి మండలంలోని కూచివారిపల్లి, రామిరెడ్డిపల్లిలో దాడులు జరిగాయి. ఈ క్రమంలోనే దాడుల ఘటనల నేపథ్యంలో హైదరాబాద్, బెంగళూరులో పని చేస్తున్న పలువురు ఐటీ ఉద్యోగులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. తాము ఓటు హక్కును వినియోగించుకునేందుకు వస్తే కేసులు పెట్టారని ఐటీ ఉద్యోగులు, కొందరు వైద్యులు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రంగంలోకి దిగిన ఈసీ తిరుపతి పోలీస్ అధికారులకు నోటీసులు జారీ చేసింది.

Spread the love