ముగ్గురు పోలీస్ అధికారులను సస్పెండ్ చేసిన ఈసీ

నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్‌లో ముగ్గురు పోలీసులను ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. విధి నిర్వహణలో పక్షపాతం చూపించారని వారిపై వేటు వేసింది. ముషీరాబాద్ పరిధిలో నగదును స్వాధీనం చేసుకున్న వ్యవహారంలో పక్షపాతం చూపించినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎన్నికల సంఘం లేఖ రాసింది. సస్పెన్షన్‌కు గురైన వారిలో డీసీపీ వెంకటేశ్వర్లు, ఏసీపీ యాదగిరి, సీఐ జహంగీర్ ఉన్నారు.
బోరబండలో మద్యం స్వాధీనం
బోరబండలో పోలీసులు పెద్ద ఎత్తున మద్యం స్వాధీనం చేసుకున్నారు. దాదాపు రూ.2 లక్షల విలువైన మద్యాన్ని తరలిస్తుండగా పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి వినాయక నగర్, బంజారా నగర్‌లో బెల్టు షాపులు నిర్వహిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు.

Spread the love