చీకోటికి తప్పని చిక్కులు..ఈడీ నోటీసులు

నవతెలంగాణ-హైదరాబాద్ : బినామీ పేర్లతో కోట్లాది రూపాయల విలాసవంతమైన కార్లను కొనుగోలు చేసి పన్నులు సక్రమంగా చెల్లించని వారిని కట్టడి చేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఆదాయపు పన్ను (ఐటీ) అధికారులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఎక్కువ బినామీ పేర్లతో కార్లు కొనుగోలు చేసిన సుమారు 40 మందికి నోటీసులు జారీ చేశారు. వీరిలో పలుమార్లు ఈడీ విచారణను ఎదుర్కొన్న చేకోటి ప్రవీణ్ ముందు వరుసలో ఉన్నట్లు భావిస్తున్నారు. అతని వద్ద రూ.కోటి విలువైన లగ్జరీ కార్లు ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. హైదరాబాద్ కు చెందిన నసీర్, మోసిన్, చీకోటి ప్రవీణ్ తో కలిసి పలువురి బినామీల పేరిట కోట్లాది రూపాయల కార్లను కొనుగోలు చేసి అధికారులకు నోటీసులు జారీ చేశారు. ఒక్కొక్కరి వద్ద రూ.10-12 కోట్ల విలువైన కార్లు ఉన్నట్లు తెలిసింది. వీరిపై సోమవారం నుంచి విచారణ ప్రారంభం కానుంది. వీరంతా పన్నులు చెల్లించకుండా బినామీ పేర్లతో లగ్జరీ కార్లను కొనుగోలు చేసి భారీగా ఆర్థిక లావాదేవీలు జరిపినట్లు గుర్తించిన ఈడీ వెంటనే రంగంలోకి దిగింది. ఆదాయపు పన్ను శాఖ ఇప్పటికే కొందరిని విచారించి వారి వాంగ్మూలాలను నమోదు చేసినట్లు సమాచారం.

Spread the love