బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకు ఈడీ నోటీసులు

నవతెలంగాణ – హైదరాబాద్ : భూదాన్ భూముల స్కామ్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. వంశీరాం బిల్డర్స్ సుబ్బారెడ్డి కూడా నోటీసులిచ్చింది. ఈ నెల 16న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ స్కామ్‌లో సూర్యతేజ, సిద్ధారెడ్డి లాభపడినట్లు ఈడీ గుర్తించింది. ఈ కేసులో ఇప్పటికే కలెక్టర్ గా పనిచేసిన అమోయ్ కుమార్‌ను పలుమార్లు విచారించింది.

Spread the love