నాపై ఈడీ రైడ్స్ జరగొచ్చు: రాహుల్ గాంధీ

నవతెలంగాణ – హైదరాబాద్: తనపై ఈడీ దాడులు చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఇటీవల లోక్‌సభలో తాను మాట్లాడిన ‘చక్రవ్యూహం’ స్పీచ్ కొంతమందికి నచ్చలేదన్నారు. రైడ్స్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు ఈడీలో ఉన్న కొందరు చెప్పినట్లు తెలిపారు. ‘ఈడీని సాదరంగా ఆహ్వానిస్తున్నా. మీకోసం చాయ్, బిస్కట్లు సిద్ధంగా ఉన్నాయి’ అని రాహుల్ రాసుకొచ్చారు.

Spread the love