నవతెలంగాణ – హైదరాబాద్: గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంపై ఈడీ కేసు నమోదు చేసింది. ఏసీబీ కేసు ఆధారంగా ఈడీ దర్యాఫ్తును ప్రారంభించింది. మనీలాండరింగ్ చట్టం కింద ఈడీ… ఈసీఐఆర్ నమోదు చేసింది. గొర్రెల పంపిణీ పథకంలో రూ.700 కోట్ల అవినీతి జరిగిందని ఏసీబీ పేర్కొంది. కేసులో పదిమంది నిందితులను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ కుంభకోణానికి సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని రాష్ట్ర అధికారులకు ఈడీ డైరెక్టరేట్ లేఖ రాసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద దీనిపై విచారణ చేపట్టనున్నామని రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య మేనేజింగ్ డైరెక్టర్‌కు హైదరాబాద్‌లోని ఈడీ జోనల్ కార్యాలయం సంయుక్త సంచాలకుడు లేఖ రాశారు. ఈ పథకానికి సంబంధించి పూర్తి సమాచారం ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు.