తెలంగాణలో 16 ప్రాంతాల్లో ఈడీ సోదాలు..

నవతెలంగాణ – హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా 16 ప్రాంతాల్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. పీజీ మెడికల్‌ సీట్లు అక్రమంగా బ్లాక్‌ చేశారన్న అభియోగంపై ఈడీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. కాళోజీ యూనివర్సిటీ ఫిర్యాదు మేరకు గతేడాది ఏప్రిల్‌లో వరంగల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. వరంగల్‌ పోలీసుల కేసు ఆధారంగా ఈడీ అధికారులు మనీలాండరింగ్‌ దర్యాప్తు చేస్తున్నారు. 10 ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు 45 సీట్లు బ్లాక్‌ చేసి తర్వాత అమ్ముకున్నాయని అభియోగం. బుధవారం ఉదయం నుంచి.. తొమ్మిది ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు, కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నాయి.

Spread the love