మంత్రి నివాసంపై ఈడీ సోదాలు

నవతెలంగాణ- రాజ‌స్ధాన్ : రాజ‌స్ధాన్ సీఎం అశోక్ గెహ్లాట్ క్యాబినెట్‌లో నెంబ‌ర్ టూగా వ్య‌వ‌హ‌రిస్తున్న మంత్రి రాజేంద‌ర్ సింగ్ యాద‌వ్ నివాసంపై ఈడీ అధికారులు సోదాలు (ED) చేప‌ట్టారు. యాద‌వ్ ఉన్న‌త విద్య, ప్ర‌ణాళిక‌, హోం, న్యాయ మంత్రిత్వ శాఖ బాధ్య‌తలు నిర్వ‌హిస్తున్నారు. జైపూర్‌లోని కోట్‌పుత్లి నుంచి ఎమ్మెల్యేగా వ్య‌వ‌హ‌రిస్తున్న యాద‌వ్ నివాసంపై సోమ‌వారం ఉద‌యం 7 గంట‌ల నుంచి సోదాలు జ‌రుపుతున్నారు. మ‌ధ్యాహ్న భోజ‌నం ప‌ధ‌కానికి సంబంధించి మ‌నీ ల్యాండ‌రింగ్ కేసులో యాద‌వ్ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈడీ, ఐటీ అధికారుల ఆధ్వ‌ర్యంలో సోదాలు జ‌రుగుతున్నాయి.

Spread the love